సెంట్రల్‌ యూనివర్శిటీ విద్యార్థుల అర్ధరాత్రి ఆందోళన  

అనంతపురం ముచ్చట్లు:

సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అనంతపురం సెంట్రల్‌ యూనివర్శిటీ విద్యార్థులు అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. కొందరు ఏకంగా నిరాహార దీక్ష చేపట్టారు. 2019లో సెంట్రల్‌ యూనివర్సిటీని జేఎనటీయూ క్యాంపస్‌లో ఏర్పాటు చేశారు. కానీ విద్యార్థులకు తగిన వసతులు కల్పించలేదు. దీనిపై గతంలో వారాల తరబడి నిరసన తెలిపారు. దీంతో తరగతుల నిర్వహణ, వసతికోసం ఈ ఏడాది ఏప్రిల్‌లో రాచానపల్లి సమీపంలోని సీఆర్‌ఐటీ క్యాంప్‌సకు వర్సిటీని మార్చారు. కానీ సమస్యలు అలాగే ఉండిపోయాయి. మౌలిక వసతులు, ఫ్యాకల్టీ, ఆనలైన పరీక్షలు, రోడ్లు, స్ర్టీట్‌ లైట్లు.. తదితర సమస్యలను పరిష్కరించకపోగా.. వారంలోపు ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

 

విద్యార్థుల ఎన్నికలు నిర్వహించడంలేదని, స్టూడెంట్‌ కల్చరల్‌ ఫండ్‌, స్కాలర్‌షిప్‌ ఇవ్వడంలేదని అంటున్నారు. హాస్టల్‌ నిర్వహణను థర్డ్‌పార్టీకి అప్పగించినా, భోజనం సరిగాలేదని వాపోయారు. ల్యాబ్‌లో కంప్యూటర్స్‌ లేవని, ఇలా అనేక రకాలుగా సమస్యల మధ్య ఎలా చదువుకోవాలని ప్రశ్నించారు. బీఎస్సీ ఆనర్స్‌ ఎకనామిక్స్‌, బీఏ ఆనర్స్‌ పొలిటికల్‌ సైన్స, ఎంఏ పొలిటికల్‌ సైన్స, ఎంఎస్సీ ఎకనామిక్స్‌, ఎంటెక్‌ ఆర్టిఫిషియరీ ఇంటెలిజెన్స, ఎంఎస్సీ అఫిలియేట్‌ సైకాలజీ, ఎంఎస్సీ మాథ్స్‌, ఇంగ్లిష్‌ వంటి 11 కోర్సులలో 500 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఇంత మంది ఇబ్బంది పడుతుంటే వీసీ స్పందించడంలేదని విద్యార్థులు మండిపడ్డారు. సమస్యలను పరిష్కరించేంతవరకు నిరాహార దీక్ష విరమించేదిలేదని విద్యార్థులు హెచ్చరించారు.

 

Tags: Midnight agitation by students of Central University

Leave A Reply

Your email address will not be published.