వలస కూలీలను నిజామాబాద్ నుండి  కరీంనగర్ రైల్వే స్టేషన్ కు

-స్వస్థలాలకు చేరుకునేందుకు ఏర్పాట్లు

Date:01/06/2020

నిజామాబాద్  ముచ్చట్లు:

లాక్ డౌన్ సందర్భంగా జిల్లాలో చిక్కుకుపోయిన 319 మంది వలస కూలీలను సోమవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి  9 బస్సులలో కరీంనగర్ రైల్వే స్టేషన్ కు తరలించారు. జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి,  సి పి కార్తికేయతో కలస తరలింపు ప్రక్రియను పర్యవేక్షించారు. ఒరిస్సాకు చెందిన వలస కార్మికులు నిజామాబాద్ జిల్లా మండలం మోపాల్, మాక్లూర్ మండలాలలో ఇటుక బట్టీల పని చేసేవారని, ఆ పని వర్షాకాలం రావడంతో ముగిసిందని, వాళ్లు ఒరిస్సా రాష్ట్రానికి వెళ్లడానికి ప్రభుత్వం అనుమతించిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సాండ్6 జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్తో చేతులు శుభ్రపరచుకోవాలని సూచించారు. నిజామాబాద్ నుండి  కరీంనగర్ రైల్వే స్టేషన్ కు  ఆర్టీసీ బస్సులలో చేరుకొని శ్రామిక్ ప్రత్యేక రైలు ద్వారా వారి స్వస్థలాలకు చేరుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్, ఆర్ డి ఓ వెంకటయ్య, ఏ సి పి శ్రీనివాస్ కుమార్, ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్ రావు తదితరులు ఉన్నారు.

 

తెలంగాణ గ్రీన్ సిగ్నల్… ఏపీలోనే..

Tags: Migrant workers from Nizamabad to Karimnagar railway station

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *