Natyam ad

తెలుగుదేశం, జనసేన పార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు

శ్రీకాళహస్తి ముచ్చట్లు:

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే కార్యాలయం నందు రేణిగుంట మండలంలోని తెలుగుదేశం,జనసేన పార్టీ నాయకులు 100 మంది మణికంఠ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి  సమక్షంలో వైకాపా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.వీరికి ఎమ్మెల్యే  వైకాపా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ,జగనన్న ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటూ ప్రజా సంక్షేమ పథకాలు తీసుకువచ్చి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తుండడం పట్ల ఆకర్షితులై నేడు వైకాపా పార్టీలో చేరడం జరిగిందని. అలాగే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యమసూదన్ రెడ్డి  అనునిత్యం ప్రజలకు సేవ చేస్తుండడం అలాగే గత 30 సంవత్సరాలు జరగని అభివృద్ధి నేడు జరగడంతో వారికి తోడుగా నిలవడం కోసం పార్టీలో చేరినామని రానున్న ఎన్నికల్లో మధుసూదన్ రెడ్డి ని అఖండ మెజారిటీతో మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని తెలిపారు.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరిన వారు ప్రకాష్ ,శివ శంకర్, గిరి శంకర్, సిద్ధులు, వెంకీ ,మణికంఠ రెడ్డి, బాలాజీ సూర్యప్రకాష్ ఫయాజ్ మనోజ్ చరణ్ మురళి గౌతమ్ అరవింద్ మహేష్ సందీప్ పవన్ ప్రభాస్ గోపి జీవా హేమంత్ ధనా చంద్ర ధనుష్ ఎడ్విన్ గణేష్ శేష సాయి గౌతమ్ గౌస్ నాని సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags:Migration from Telugu Desam and Janasena party to YSR Congress party

Post Midle