Natyam ad

వ్యవసాయ కూలీలుగా బెంగాలీల వలస

ఖమ్మం, ముచ్చట్లు:

పినపాక ఏజెన్సీలో గత కొద్ది సంవత్సరాలుగా కూలీల  కొరత ఏర్పడింది. పినపాక మండలంలోని గోదావరి తీర ప్రాంతంలో మిర్చిని ఎక్కువగా పండిస్తుంటారు రైతులు. కమర్షియల్ క్రాఫ్‌గా ఉన్న మిర్చికి అధిక ధర ఉండడంతో అనేక మంది రైతులు మిర్చి సాగుపైనే దృష్టి సారించారు. ఈ క్రమంలో కూలీల కొరత ఏర్పడింది. ఎవరికివారు అధిక ధరలు చెల్లిస్తూ తమ పంట పొలాలలో పని చేపించుకునేందుకు కూలీల కోసం పోటీ పడుతుండడంతో గ్రామాల్లో కూలీలకు డిమాండ్ పెరిగింది. దీంతో గత రెండు సంవత్సరాలుగా అక్కడికి సీజనల్ గెస్టులు వస్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు బెంగాలీ వాసుల కోలాహలం కనిపిస్తుంది. పశ్చిమ బెంగాల్ నుండి అనేకమంది కూలీలు ఇక్కడ పనిచేసేందుకు రావడం గత రెండేళ్లుగా ఆనవాయితీగా మారింది.

Post Midle

సుమారు 100 మంది కలిగిన ఈ బృందం పినపాక మండలంలో మకాం వేసుకుని రెండు నెలల పాటు ఇక్కడ పనిచేసి వెళ్తుంటారు.వర్షాకాలంలో ముఖ్యంగా రైతులు కూలీలు దొరకక అనేక ఇబ్బందులు పడుతున్నారు. వరి పండించే రైతులకు సాగు కష్టతరంగా మారింది. వరి నాట్లు వేసేందుకు స్థానికంగా ఉండే కూలీలు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తుండడంతో రైతులకు వరి సాగు భారంగా మారింది. ఈ నేపథ్యంలోనే కొందరు స్థానిక రైతులు పశ్చిమబెంగాల్ నుండి కూలీల తీసుకురావడం మొదలుపెట్టారు..

స్థానిక కూలీలతో పోల్చుకుంటే వీరికి తక్కువ డబ్బులు చెల్లిస్తారు. అలాగే పని కూడా చాలా నీట్ గా ఉండడం, నాట్లు వరుస క్రమంలో వేయడం వీరి ప్రత్యేకత. అతి తక్కువ ఖర్చుతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరగా వరి నాట్లు పూర్తవుతుండడం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ వీరితో పని చేయించుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.వర్షాకాలం వచ్చిందంటే చాలు బెంగాల్ కూలీలతో ఈ ప్రాంతం సందడిగా మారుతుంది.  వీరి భాష, మాటలు, అలవాట్లు కొత్తగా ఉండడం ఇక్కడి ప్రజలను ఆకర్షిస్తుంటుంది. ఉదయం ఆరు గంటలకే పంట చేల్లోకి వెళ్లేటువంటి వీరు అలుపు లేకుండా చీకటి పడేంత వరకు పనిచేస్తుంటారు. ఈ బెంగాలీ కూలీల గురించి చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ప్రచారం జరగడంతో.. తమకు కూడా అక్కడి కూలీలు కావాలని ఆయా ప్రాంతాల రైతులు అడుగుతున్నారు. స్థానికంగా ఉంటున్నవారు. పని సరిగ్గా చేయడం లేదని.. ఇలా మంచిగా పని చేసేవారికి ఒక రూపాయి ఎక్కువ ఇచ్చినా తప్పు లేదంటున్నారు.

 

Tags : Migration of Bengalis as agricultural labourers

Post Midle