వలస కార్మికుల నానా కష్టాలు

Date:09/05/2020

హైద్రాబాద్ ముచ్చట్లు:

కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్రంలో చిక్కుబడి పోయిన వేలాది మంది వలస కార్మికులు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లడానికి నానా కష్టాలు పడుతున్నారు. హైదరాబాద్‌ మొదలుకుని దాదాపుగా ప్రతి జిల్లా నుంచి వలస కార్మికులు సొంతూర్లకు ఎప్పుడు వెళ్లిపోదామా అని ఆతృత పడుతుండగా, వారికి తగిన పాస్‌లు జారీ చేయడవలో, వాహనాలు కల్పించడంలో ప్రభుత్వ యంత్రంగం నుంచి తగిన స్పందన లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీ వాహనాలు వద్దు మాకు పాస్‌లు ఇస్తే చాలు సొంత వాహనాలను ఏదో విధంగా ఏర్పాటు చేసుకుని వెళ్లిపోతామంటున్న కార్మికుల సంఖ్యే ఎక్కువగా ఉంది. గురువారం కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రోడ్లపైకి వచ్చిన వలస కార్మికులను సముదాయించలేక పోలీసులు పడ్డ పాట్లు అంతా ఇంతా కాదు.సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని మాదాపూర్‌, రాయుదుర్గం, గచ్చిబౌలి పోలీసు స్టేసన్‌ వద్ద ఉదయం నుంచే వందలాది మంది కార్మికులు పాస్‌ల కోసం, తమకు కేటాయించిన రైళ్ల సమాచారం కోసం పడిగాపులు పడ్డారు. తాము ఏ విధంగానైనా సొంతూర్లకు వెళ్లి పోతామని పాస్‌లు ఇవ్వాలంటూ ఆందోళనకు దిగిన కార్మికులను అదుపు చేయడానికి పోలీసులు స్వల్పంగా లాఠీ చార్జి చేసి వారిని చెదర గొట్టారు.

 

 

 

 

తర్వాత ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఓపిక పడితే పాస్‌లు ఇస్తామని, తప్పకుండా వారి రాష్ట్రాలకు పంపిస్తామంటు హామీలు ఇవ్వడంతో పరిస్థితి సద్దు మణిగింది. అదే విధంగా పాస్‌లు లభించినా రైలు కాని, ఇతరవాహనాలు కాని తమకు ఏర్పాటు కాకపోవడంతో దాదాపు వేయి మంది ఒడిశాకు చెందిన కార్మికులు కాలి నడనకనే సిటీ నుంచి బయలుదేరి వెళ్లారు. ఎండలో సైతం పిల్లా పాపలను, బ్యాగులను పట్టుకుని అష్టకష్టాలు పడుతు కార్మికులు రెండు రోజుల తర్వాత భద్రాద్రి జిల్లాకు చేరుకోవడం అధి కారులను సైతం మనసు చివ్వుక్కుమనేలా చేసింది.ఇక సూర్యాపేట్‌, నల్లగొండ జిల్లాల సరిహద్దుల్లో సైతం వందలాది మంది కార్మికులు తమ సొంత రాష్ట్రానికి వెళ్తామంటు రోడ్లపైనే ధర్నాలకు దిగారు. వారందరికీ వైద్య చికిత్సలు జరిపించి పంపు తామంటు అధికారులు ఎంతగా చెబుతున్నా ,

 

 

 

 

 

ఇప్పటికే తిండితిప్పలు లేక సతమత మవుతు న్నామని, తమను వెంటనే పంపించి వేయాలని లేకపోతే కాలి నడకనే వెళ్లిపోతామంటూ వారు ఆగ్రహంతో ఊగిపోయారు.కాగా ఘటేకేసర్‌ నుంచి బీహార్‌కు రైళ్లను నడుపుతున్నట్టు అందిన సమాచారంతో అనేక మంది కార్మికులు ఆ ప్రాంతానికి చేరుకోన్నారు. కాగా నాగకర్నూల్‌, నిజామాబాద్‌, అదిలాబాద్‌, సంగారెడ్డి, వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో సైతం వందలాది మంది వలస కార్మికులు సోంతూర్లకు లైను కట్టడంతో వారందరికీ ప్రయాణ వెసులుబాటు కల్పించేందుకు పోలీసు అధికారులు నానాపాట్లు పడుతున్నారు. సౌక ర్యాలు కల్పించాల్సిందిరెవిన్యూ విభాగం అయినప్పటికీ రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగుతున్న కార్మికులను కట్టడి చేయడం పోలీసులకు తలకు మించిన భారంగా మారింది. మరో వైపు ప్రతి కార్మికుడి ఐడీలను పరిశీలించి పాస్‌ల జారీ కూడా అధికారులకు తలనొప్పిగా మారింది.

కమల్ హాసన్ వ్యాఖ్యలపై సంగీత కళకారుల మండిపాటు

Tags: Migration of migrant workers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *