రెట్టింపువుతున్న మైగ్రేషన్ పీపుల్

 Date:18/07/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
భార‌తీయులు వ‌ల‌స వెళ్లే దేశాల క్ర‌మం మారింది. ఓఈసీడీఆర్గ‌నైజేష‌న్ ఫ‌ర్ ఎక‌న‌మిక్ కోఆప‌రేష‌న్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్) మైగ్రేష‌న్ అవుట్‌లుక్ 2018 పేరిట ప్ర‌చురించిన నివేదిక ఈ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టింది. ఈ శ‌తాబ్దం ప్రారంభం నుంచి ధ‌నిక ఓఈసీడీ దేశాల‌కు వెళ్లే భార‌తీయుల సంఖ్య రెట్టింపైంద‌ని ఇందులో వెల్ల‌డైంది. అంతే కాకుండా కొత్త దేశాల‌కు సైతం వెళ్లేందుకు భార‌తీయులు మొగ్గుచూపుతున్న‌ట్లు తెలుస్తోంది. తాజాగా 2016 సంవ‌త్స‌రం డేటాను ఆధారం చేసుకుని ఈ నివేదిక‌ను ప్ర‌చురించారు. వ‌ల‌స వెళ్లే వారి విష‌యంలో 2.71 ల‌క్ష‌ల మందితో ఇండియా 5వ స్థానంలో ఉన్న‌ట్లు నివేదిక బ‌య‌ట‌పెట్టింది. జాబితాలో టాప్-3 దేశాలు చైనా, రొమేనియా, సిరియా మూడు స్థానాల్లో ఉన్నాయి.
వ‌ల‌స‌లకు సంబంధించి ఏళ్ల త‌ర‌బ‌డి స‌మాచారం విశ్లేషించి నివేదిక త‌యారుచేశారు. దీని ప్ర‌కారం వ‌ల‌స వెళ్లేందుకు భార‌తీయులు ఎంచుకుంటున్న దేశాలు భిన్నంగా ఉన్న‌ట్లు తేలింది. 2000 స‌మయంలో ఫేవ‌రెట్ దేశాలుగా యూకే లేదా యూఎస్ఏ ఉండేది. ఇప్పుడు అవే కాకుండా ఆస్ట్రేలియా, జ‌ర్మ‌నీ వంటి ఇత‌ర దేశాల‌ను గ‌మ్య‌స్థానాలుగా ఎంచుకుంటున్నారు.
ఓఈసీడీ డేటా ప్ర‌కారం 2016 సంవ‌త్స‌రంలో ఆస్ట్రేలియా.. ఇండియా నుంచే అత్య‌ధిక వ‌ల‌స అప్లికేష‌న్ల‌ను అందుకుంది. మ‌రో వైపు శ‌తాబ్ద ప్రారంభం నుంచి చూస్తే యూకే, యూఎస్ దేశాల‌కు వెళ్లేవారు మొద‌టి ద‌శాబ్దంలో 50% త‌గ్గితే ఇప్పుడు అది కాస్త త‌గ్గి 2016 నాటికి 37 శాతానికి చేరింది.
2016 సంవ‌త్స‌రం ప్ర‌కారం భార‌తీయులు వ‌ల‌స వెళ్లేందుకు ఇష్ట‌ప‌డే మొద‌టి 5 దేశాలు
1. అమెరికా సంయుక్త రాష్ట్రాలు
2. యూకే
3. ఆస్ట్రేలియా
4. కెన‌డా
5. ఇటలీ
కెన‌డా దేశానికి వ‌ల‌స వెళ్లే భార‌తీయుల వాటా సైతం 2000 సంవ‌త్స‌రం నుంచి త‌గ్గుతున్న‌ది. దాదాపు ఆస్ట్రేలియాకు వెళ్లే వ‌ల‌స సంఖ్య‌తో ఇది స‌మానంగా ఉంది. మ‌రో వైపు ఓఈసీడీ నివేదిక ప్రకారం… ఆస్ట్రేలియా, ఇట‌లీ దేశాల‌కు వ‌ల‌స వెళ్లే భార‌తీయుల సంఖ్య 2016నాటికి క్ర‌మంగా పెరిగింది. వ‌ల‌స వెళ్లే వారు ఎక్కువ‌గా ఉన్న దేశాల్లో ఓఈసీడీలో మ‌న దేశం ప్ర‌థ‌మ స్థానంలో ఉంది. ఆ త‌ర్వాతి స్థానాల్లో మెక్సిక‌న్లు(2), మొరాక‌న్లు(3), ఫిలిప్పియ‌న్లు(4), చైనీయులు(5) ఉన్నారు.
రెట్టింపువుతున్న మైగ్రేషన్ పీపుల్ https://www.telugumuchatlu.com/migration-people-doubling/
Tags:Migration people doubling

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *