"Milad un Nabi" celebrations in the town of Emmiganoor

ఎమ్మిగనూరు పట్టణంలో “మిలాద్ ఉన్ నబి” వేడుకలు

Date:30/10/2020

ఎమ్మిగనూరు ముచ్చట్లు:

శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరుపుతున్నారు. ముస్లింలు ఆయా మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జమియా మసీదు నుండి మైదానం మీదుగా చున్నం బట్టీ మసీదు, హాఫీజ్ మసీదు మీదుగా జమియా మసీదు వరకు కోవిడ్-19  నిబంధనలు అనుగుణంగా పట్టణంలో ముస్లింలు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణ సీఐ ప్రభాకర్ రెడ్డి, ఎస్ ఐ శ్రీరామ్ ప్రసాద్ ల ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు  శాసన సభ్యులు “ఎర్రకోట చెన్నకేశవరెడ్డి” కృతజ్ఞతలు తెలియాజేశారు. ఈ కార్యక్రమంలో జామీయా మసీదు పాలకవర్గం ఉమ్మర్ సాబ్, సయ్యద్ చాంద్, కాశిం బేగ్, అల్లవుద్దీన్, షాబీర్, నూర,రహంతుల్లా, మన్సూర్ బేగ్, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

ఇద్దరు పిల్లలు, తల్లి అదృశ్యం

Tags: “Milad un Nabi” celebrations in the town of Emmiganoor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *