పాల ట్యాంకర్ పేలి ఒకరి మృతి
అన్నమయ్య ముచ్చట్లు:
అన్నమ్మయ్య జిల్లా రాయచోటి వరిగ క్రాస్ వద్ద గల విజయ పాల సీతలీకరణ కేంద్రం లో పాలు నిల్వ చేసే ట్యాంకర్ పేలి వ్యక్తి మృతి చెందాడు. మరొకరికి గాయాలు అయ్యాయి. మృతుడు జోగేంద్ర సింగ్ (32) మెహందీ పూర్, హర్యానా కి చెందిన టెక్నీషియన్ గా గుర్తించారు.
క్షత గాత్రుడు నాగరాజు (45) చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ట్యాంకర్లో నెలకొన్న శీతలీకరణ సమస్యను పరిష్కరించాడానికి మృతుడు హర్యానా నుండి వచ్చినట్లు సమాచారం. రిపేరు చేసే సమయంలో ట్యాంకర్ లో గ్యాస్ ఒత్తిడి ఎక్కువ కావడం తో ట్యాంకర్ పేలిపోయింది. ట్యాంకర్ లోని మృతదేహాన్ని అగ్నిమాపక సిబ్బంది బయటకు తీసారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం అందిన పోలీసులు వెంటనే సంఘటనా స్థలాన్ని చేరుకొని జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసారు.
Tags: Milk tanker explodes, one killed

