క్వీన్ రీమేక్ లో మిల్కీ బ్యూటీ

Milky Beauty in Queen Remake

Milky Beauty in Queen Remake

Date:19/10/2018
ముంబై ముచ్చట్లు:
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘దట్‌ ఈజ్‌ మహాలక్ష్మి’. బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ సినిమా ‘క్వీన్‌’ సినిమాకి ఇది రిమేక్‌. అక్కడ కంగనా రనౌత్ పోషించిన పాత్రను తెలుగులో తమన్నా చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో ఒకే సమయంలో తెరకెక్కుతోన్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను శనివారం నాడు విడుదల చేసింది చిత్రయూనిట్. లంగా వోణీలో వయ్యారంగా నడువొంపుల్ని ప్రదర్శిస్తూ.. పారిస్‌లోని ఐఫిల్‌ టవర్‌ ముందు డాన్స్‌ చేస్తున్నట్టుగా ఉన్న ఈ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ఆకట్టుకునేలా ఉంది. ఇక తెలుగులో ఈ చిత్రాన్ని ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. కాజల్, జగపతిబాబు ముఖ్యపాత్రల్లో నటిస్తుండగా.. సంజయ్‌ స్వరూప్‌ సిద్ధు జొన్నలగడ్డ, జీవీఎల్‌ నరసింహ రావు, మాస్టర్‌ సంపత్‌ ఇతరపాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అమిత్‌ త్రివేది సంగీతం అందిస్తున్నారు. ‘100% లవ్’ చిత్రంలో తమన్నా పాత్ర పేరు మహాలక్ష్మి. తన గొప్పను చెప్పుకున్నప్పుడల్లా ‘దటీజ్ మహాలక్ష్మి’ అంటూ ఉంటుంది. ఇప్పుడు ఆ డైలాగును తాను హీరోయిన్‌గా నటిస్తున్న సినిమాకు టైటిల్‌గా పెట్టడం ఆనందంగా ఉందంటోంది తమన్నా.
Tags:Milky Beauty in Queen Remake

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *