Natyam ad

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘గని’ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్‌కు అద్భుతమైన స్సందన. 

హైదరాబాద్‌ ముచ్చట్లు:
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న సినిమా గని. అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్
సమర్పకుడిగా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ తమన్నా ఐటం సాంగ్ చేసారు. ఈ మధ్యే విడుదలైన పాటకు అనూహ్యమైన
స్పందన వస్తుంది. యూ ట్యూబ్‌లో మిలియన్స్ కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. ‘కొడితే’ అంటూ సాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాసారు. హారిక నారాయణ్ పాడిన ఈ పాట ట్రెండింగ్‌లో ఉంది. తమన్నా
అందచందాలు పాటకు అదనపు ఆకర్షణ. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ చాలా మేకోవర్ అయ్యారు. సిక్స్ ప్యాక్ చేసి సరికొత్త ఫిజిక్‌తో కనిపిస్తున్నారు. జనవరి 19న ఈయన పుట్టిన రోజు సందర్భంగా
విడుదలైన టీజర్‌కు అద్భుతమైన స్పందన వస్తుంది. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా
విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు మరింత పెంచేస్తుంది. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.నటీనటులు: వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్, జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర తదితరులు
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Milky Beauty Tamanna’s special song in ‘Mega Prince Varun Tej’ Gani ‘.

Leave A Reply

Your email address will not be published.