కోటిశ్వరులు పైనే కమలం గురి
హైదరాబాద్ ముచ్చట్లు:
ఇప్పటికిప్పుడు వ్యాపారం పెంచుకోవాలంటే లక్షాధికారి అవసరం మావా..అంటాడు ఓ సినిమాలో విలన్ తాలూకు అల్లుడు. వ్యాపారంతో నలుగురిని పోగేసి ఎగస్పార్టీఓడిని తాటిచెట్టుక్కట్టేయొచ్చు.. అని అసిస్టెంటు సలహా! ఈ రెండో మాట ఎలా వున్నా ప్రస్తుత రాజకీయాలకు ప్రతీ చిన్న ఎన్నికకూ ధనికుల అవసరం బాగా పడుతోంది. ప్రతీ పార్టీ ధనికుల అండదండలతో ప్రశాంతంగా గెలుపు ధీమాతో ఉంటోం ది. ఇపుడు బీజేపీ వారి ఆలోచనా అదే.అసలు బీజేపీ అంటేనే సంపన్నుల పట్ల ప్రత్యేకాదరణ ఉన్న పార్టీ అనే అభి ప్రాయం ఎలాగూ ఉంది. ఆ అభిప్రాయానికి బలం చేకూర్చే విధంగానే ఇప్పుడు తెలంగాణలో బీజేపీలో చేరికల తీరు ఉంది. కేవలం సంపన్నులను, ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్లను ఎంచుకుని మరీ బీజేపీ గాలం వేస్తోంది. ఆర్థికంగా దన్ను ఉన్న వారికి మాత్రమే తమ పార్టీలో ఎంట్రీ అని చెప్పకనే చెబుతోంది. పార్టీని నిలబెట్టడానికి, నడిపించడానికి బీజేపీకి అభిమానులు ఉన్నారు, జెండా భుజాన వేసుకుని జీవితాన్నిపార్టీకోసం పణంగా పెట్టే వీరాభిమానులూ ఉన్నారు.
అయితే పార్టీకి ఆర్థిక దన్నుగా నిలబడి అవసరమైనప్పుడు సొమ్ములు వెదజల్లి మరీ పార్టీకి అండగా నిలబడే వారే బీజేపీకి ముఖ్యంగా తెలంగాణ బీజేపీకి ఇప్పుడు అవసరం అందుకే బీజేపీ ఏరి కోరి మరీ ఆర్థకంగా బాగా పరిపుష్టత ఉన్నవారికి పార్టీలో చేర్చుకుంటోంది. మొన్నటికి మొన్న కొండా విశ్వేవ్వరరెడ్డి, ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, ఎర్రబెల్లి ప్రదీప్ రావులకు బీజేపీ రెడ్ కార్పెట్ పరిచింది. పరిశీలకుల అబ్జర్వేషన్ మేరకు ఎన్నికల ఖర్చుకు వెనకాడని వారిని పార్టీలోకి ఆహ్వానించడం వల్ల చిన్నపాటి సమస్యల్ని ఎదుర్కొనడా నికి వారికి శక్తి ఉంటుందని, ప్రతీ అంశంలోనూ అధిష్టానం కల్పించుకుని పనులు జరిగేలా చూడాల్సిన సమస్య ఉండదని పార్టీ సీనియర్ల మాట. ముఖ్యంగా ఉప ఎన్నికల సమయంలో పార్టీని గెలిపించడానికి అవసరమైన ఆర్దిక మద్దతు, జనాకర్షణ సమాజంలో ప్రముఖులు, ధనికులతోనే అవుతుందన్నది బీజేపీ నమ్మకం.ఇకపై పార్టీలోకి ఎవర్ని ఆహ్వానించాలనుకున్నప్పటికీ ఆర్ధికంగా బలంగా ఉన్న వారినే తీసుకోవాలని బీజేపీ అధిష్ఠానం పార్టీ తెలంగాణ అధ్యక్షుడికి మౌఖిక ఆదేశాలించ్చిందని పరిశీలకులు భావిస్తున్నారు. తెలంగాణలో ప్రత్యేకంగా చేరికల కమిటీ ఏర్పాటు ఉద్దేశం కూడా అదేనంటున్నారు. ఎందుకంటే ఆ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ రాజకీయంగానే కాకుండా ఆర్థికంగా కూడా సుసంపన్నులన్న సంగతి తెలిసిందే.
Tags: Millionaires are the lotus target