70 భాషల్లో కోటి పుస్తకాలు

ఢిల్లీ ముచ్చట్లు :

 

 

దేశంలోని పిల్లలు, నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం కోటి పుస్తకాలను అందుబాటులోకి తెచ్చింది. ఖరగ్‌పూర్‌ ఐఐటీ సాయంతో హెచ్‌ఆర్‌డీ మినిస్ట్రీ ఈ మేరకు చర్యలు తీసుకుంది. ఒకటో తరగతి నుంచి పీహెచ్‌డీ వరకు అన్నిరకాల పుస్తకాలు అందులో ఉన్నాయి. కేవలం ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉంటే చాలు..ఓ గ్రంథాలయం ఉన్నట్టే. ఉద్యోగ పరీక్షలకు సిద్ధం అయ్యే అభ్యర్థులైనా..పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యే విద్యార్థులైనా.. ఫలానా పుస్తకం దొరకడం లేదన్న బెంగ అక్కర్లేదు. యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్, రాష్ట్ర సర్వీస్‌ కమిషన ఒకటో తరగతి నుంచి పీహెచ్‌డీ వరకు అవసరమైన రిఫరెన్సు పుస్తకాల దాకా అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్‌లో చదువుకోవచ్చు.వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కావాలనుకుంటే వాటికి సంబంధించిన
వీడియోలు చూడవచ్చు. ఆడియోలను వినవచ్చు. పీడీఎఫ్‌ కాపీలను కూడా పొందొచ్చు.

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Millions of books in 70 languages

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *