ఎంఐఎం కాల్పుల కేసు వాయిదా
అదిలాబాద్ ముచ్చట్లు:
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అదిలాబాద్ జిల్లా తాటిగూడ ఫైరింగ్ కేసు తుది తీర్పు ను ప్రత్యేక న్యాయస్థానం జడ్జి ఈ నెల 24 వ తేదీ కి వాయిదా వేశారు. డిసెంబర్ 18 వ తేదీ 2020 సంవత్సరం
లో ఎంఐఎం జిల్లా మాజీ అధ్యక్షుడు షారుఖ్ అహ్మద్ తన ఇంటి పక్కన ఉన్న వారిపై విచక్షణ రహితంగా గన్ తో కాల్పులు జరిపారు. ఈ సంఘటన లో ఇద్దరు గాయపడగా, ఒకరు చికిత్స పొందుతూ
మృతిచెందారు. ఈ కేసు ను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ను ఏర్పాటు చేసింది. రోజు వారీ విచారణ లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కోర్టు లో ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు
36 మంది సాక్షులలో 24 మంది సాక్షులను విచారించి ఈ రోజు తుది తీర్పు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ కేసు లో నిందితుడిగా ఉన్న షారుఖ్ అహ్మద్ ను ప్రత్యేక న్యాయస్థానం జడ్జి ఎదుట
పోలీసులు హాజరు పరిచారు. విచారణ ప్రారంభం అయిన కొద్ది సమయానికే ఈ కేసును 24వ తేదీ కి వాయిదా వేశారు. ఈ సందర్భంగా స్పెషల్ పిపి రమణారెడ్డి మాట్లాడుతూ ఈరోజు కేసు తుది తీర్పు
రావల్సిఉన్నపటికీ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి తీర్పు ను ఈ నెల24వ తేదీ కి వాయిదా వేశారని చెప్పారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: MIM shooting case adjourned