గులాబీలో మైండ్ గేమ్

Date:20/01/2021

హైదరాబాద్ ముచ్చట్లు:

రాజకీయాల్లో మైండ్ గేమ్ చాలా ముఖ్యమైనది. ఈ మైండ్ గేమ్ కోసం విసిరే మాటల బాంబులు ప్రత్యర్థుల శిబిరాలను ఒక్కోసారి కాకావికలం చేసేస్తాయి. దీనిలో ఎవరిది పై చేయిగా ఉంటె ఒక్కోసారి ఎన్నికల్లో సైతం వారిదే పై చేయి అవుతూ ఉంటుంది కూడా. ప్రస్తుతం తెలంగాణ లో బిజెపి మైండ్ గేమ్ ముందు గులాబీ పార్టీ బేల గా మారిపోయింది. దుబ్బాక, జీహెచ్ ఎం సి ఎన్నికల్లో కమలం వేసిన ఎత్తులు పై ఎత్తుల్లో మైండ్ గేమ్ కూడా ప్రధానమైంది.వారు వేసిన వ్యూహాలు వ్యూహకర్త గులాబీ దళపతి కేసీఆర్ నే ఉక్కిరి బిక్కిరి చేసేలా సాగాయి. ఇప్పుడు మళ్ళీ అలాంటి ఆటే కాషాయం పార్టీ మొదలు పెట్టేసింది. నాగార్జున సాగర్ లో ఉప ఎన్నికలు వరంగల్ వంటి చోట ఉన్న కార్పొరేషన్ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో మరోసారి తమ నోటికి కమలం నేతలు బాగా పని చెబుతున్నారు. అధికార పార్టీని ఇబ్బంది పెట్టేందుకు ప్రతి క్షణం ప్రయత్నిస్తున్నారు.టీఆర్ఎస్ లో ముగ్గురు ఎమ్యెల్యేలకు వచ్చే క్యాబినెట్ విస్తరణలో చోటు దక్కకపోతే కారును రెండు ముక్కలు చేసి వేరే పార్టీ పెట్టేస్తారట. ఇది చెప్పింది తెలంగాణ బిజెపి దళపతి బండి సంజయ్. ఆయన ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేయడం కొత్తేమి కాదు. కానీ ఈసారి ఏకంగా అధికారపార్టీలో చీలిక అంటూ చేసిన వ్యాఖ్యలు మాత్రం టీఆర్ఎష్ లోనే కాదు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చకు తెరతీసింది.

 

 

అనారోగ్యం త్వరలో కెటిఆర్ నూతన ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కనున్నారని ఒక పక్క ప్రచారం సాగుతుండగా టీఆర్ఎస్ లో చీలిక తప్పదా అన్న చర్చ ఆసక్తికరం గా మారింది. అంటే బిజెపి ఆ దిశగా వ్యూహాలు రచిస్తుందా ? లేక అధికారపార్టీని గందరగోళానికి గురిచేస్తుందా ? ఎన్నికల కోసం కొత్త మైండ్ గేమ్ నా అన్న ప్రశ్నలకు సమాధానం త్వరలో తేలనుంది. ఇప్పుడు తెలంగాణ లో ప్రధాన రాజకీయ నేతలు చేసే వ్యాఖ్యల్లో నిజం ఏమిటో అబద్ధం ఏమిటో తెలియని పరిస్థితిలో మాత్రం జనం కొట్టుమిట్టాడుతున్నారు.

ముద్రగడకు రాజ్యసభ ఆఫర్

Tags: Mind game in pink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *