రూ.2 కోట్లతో మిని స్టేడియం, ఇండోర్‌ స్టేడియం నిర్మాణం

Mini stadium, indoor stadium construction with Rs.2 crore

Mini stadium, indoor stadium construction with Rs.2 crore

-శాప్‌పీవో లక్ష్మి

Date:17/08/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని శుభారాం డిగ్రీ కళాశాల వద్ద ఐదు ఎకరాల భూమిలో రూ.2 కోట్లతో మిని స్టేడియం, ఇండోర్‌ స్టేడియం నిర్మాణ పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా సెట్విన్‌ పీవో , ఇన్‌చార్జ్ శాప్‌పీవో లక్ష్మి తెలిపారు.

 

శుక్రవారం ఆమె మైదానాన్ని పరిశీలించారు. అలాగే మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మతో సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వాదేశాల మేరకు రూ.2 కోట్లతో స్టేడియంలు నిర్మించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు.

 

టెండర్లు పూర్తికాగానే పనులు చేపడుతామన్నారు. పట్టణంలో స్టేడియంల నిర్మాణం ఎంతో ఉపయోగకరమన్నారు. ముఖ్యంగా కబడ్డీ, వాలీబాల్‌ క్రీడలకు పుట్టినిల్లుగా ఉన్న పుంగనూరులో స్టేడియం లేకపోవడం బాధకరమన్నారు.

 

ప్రభుత్వాదేశాలతో క్రీడాకారులకు స్టేడియం ఎంతో ఉపయోగకరమౌతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర, అంతరాష్ట్ర పోటీలను పుంగనూరులో పలుమార్లు నిర్వహించినా స్టేడియం లేకపోవడంతో బసవరాజ కళాశాల మైదానం, బిఎంఎస్‌క్లబ్‌ మైదానంలో నిర్వహిస్తున్నారని తెలిపారు.

 

 

స్టేడియం నిర్మాణంతో మరిన్ని పోటీలు నిర్వహించుకునేందుకు వీలుందన్నారు. ఈమె వెంట కబడ్డీ సంఘ నాయకులు రామచంద్ర, హేమంత్‌కుమార్‌, వెంకటేష్‌ వెహోదలియార్‌, ఇంతియాజ్‌, ఒలంపిక్‌ జిల్లా కార్యదర్శి గిరి, ప్రిన్సిపాల్‌ వెంకట్రామ, వైస్‌ ప్రిన్సిపాల్‌ క్రిష్ణయ్య, పీడి రాబర్ట్ తో పాటు ఎల్‌కె. నందీశ్వర స్థానిక క్రీడాకారులు హాజరైయ్యారు.

న్యాయవాదులు విధులు బహిష్కరణ

Tags; Mini stadium, indoor stadium construction with Rs.2 crore

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *