Natyam ad

కశింకోట లో శంకుస్థాపన, ప్రారంభోత్సవాలుపాల్గోన్న  మంత్రి అమర్నాథ్,ఎంపి డాక్టర్ బి వి సత్యవతి

అనకాపల్లి ముచ్చట్లు:

మండల కేంద్రమైన కసింకోట గ్రామానికి శనివారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్నాథ్,ఎంపి డాక్టర్ బి వి సత్యవతి వివిధ అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం, శంకుస్థాపనల కార్యక్రమాలకు విచ్చేసారు జిల్లా వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి మళ్ల బుల్లిబాబు వారిని ఘనంగా ఆహ్వానించారు. బుల్లి బాబు నేతృత్వం లో గ్రామంలో 5 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు మంత్రి ఆమర్నాధ్ చేశారు. అందులో భాగంగా గ్రామపంచాయతీ పరిధిలో 150 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని పర్యవేక్షించే కంట్రోల్,స్థానిక పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రారంభించరు. సచివాలయలు 1,3 నూతన భవన నిర్మాణ ప్రారంభోత్సవాలు, బజార్ వీధిలో ఎస్సీ కాలనీ కమ్యూనిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన, గ్రామపంచాయతీ నిధులతో వేసిన సిసి రోడ్ల ప్రారంభోత్సవం, నాడు… నేడు లో భాగంగా డి పి ఎన్ హై స్కూల్ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్లలో   లో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం,శంకుస్థాపన,కశింకోట గవర్నమెంట్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో నిర్మించిన ప్రహరీ గోడ ప్రారంభోత్సవము, నాడు నేడు ఫేస్ వన్ లో నెంబర్ వన్ ప్రాథమిక పాఠశాలలో జరిగిన పనులకు ప్రారంభోత్సవ కార్యక్రమాలు అమర్నాథ్ చేతుల మీదగా జరిగాయి.

 

Tags: Minister Amarnath, MP Dr. BV Satyavati participated in the foundation stone laying and inauguration ceremonies in Kashinkota.

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.