Natyam ad

విశాఖ రాజధానిపై మంత్రి అమర్ కీలక వ్యాఖ్యలు

విశాఖపట్నం ముచ్చట్లు:


అమరావతిలో తన బినామీ ల కోసం చంద్రబాబు ఉత్తరాంధ్రపై విషం చిమ్ముతున్నారని ఐటీ, పరిశ్ర మల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ మండిపడ్డారు.ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు వెన్నుపోటు నాయకుడి వెంట ఉండి ప్రస్తుతం ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందకుండా వెన్నుపోటు పొడుస్తున్నారని మండిపడ్డారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందని విమర్శించారు. టీడీపీ హయాంలో 22 సంవత్సరాలు గా ఉత్తరాంధ్రకు ఏం చేశారో ఇక్కడి ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రపై విషం చిమ్మి అమరావతి వైపు పెట్టుబడులు వెళ్లేలా చేయడమే ప్రధాన ఉద్దేశమని వివరించారు.ఉత్త రాంధ్ర అంటే గంజాయి సాగు జరుగు తుందని పంటలు పండవని టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.వచ్చే ఏడాది లోపు విశాఖ పరిపాలనా రాజధానిగా మారుతుందని మంత్రి స్పష్టం చేశారు. విశాఖ రాజధాని ప్రకటనకు గర్జనలో ప్రజల ఆమోదం లభించదని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ మూడు రాజధా నుల నిర్ణయానికి ప్రజల మద్ధతు ఉంద ని దీనిపై త్వరలోనే బిల్లు ప్రవేశపెడతా మని వివరించారు. రాష్ట్రానికి పరిపాల నా రాజధానిగా విశాఖ నగరానికి అన్ని అర్హతలు ఉన్నాయని అన్నారు.జనసే న పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు మద్దతు ఇచ్చే విషయంలో యువత జాగ్రత్తగా ఉండాలని అమర్నాథ్ సూచించారు.

 

Tags: Minister Amar’s key comments on the capital of Visakhapatnam

Post Midle
Post Midle