నారా లోకేష్ పై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధ్వజం

నెల్లూరు ముచ్చట్లు :

 

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై ఏపి ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సూళ్లూరుపేటలో నెర్రికాలువ ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడారు. సంస్కారం లేకుండా మాట్లాడుతున్నది లోకేష్ అని అందరికి తెలుస్తోందన్నారు. తనను, కొడాలి నానిని నోటి పారుదల, బూతుల మంత్రి అంటున్నారని, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని సూచించారు. ఇక జీవితంలో ఏపీలో టీడీపీకి ఒక్క సీటు కూడా రాదని, అందుకే చంద్రబాబు హైదరాబాద్ కు మకాం మార్చే శాడని ఎద్దేవా చేశారు. లోకేష్ నోరు అదుపులో పెట్టుకోవాలని, తాము నోరుతెరిస్తే తట్టుకోలేరని ధ్వజమెత్తారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags: Minister Anil Kumar Yadav flags on Nara Lokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *