Minister attending Corona patient funeral

కరోనా రోగి అంత్యక్రియల్లో పాల్గోన్న మంత్రి 

Date:11/08/2020

మహబూబ్ నగర్ ముచ్చట్లు:

కరోనా వైరస్ సోకి మరణించిన మహబూబ్నగర్ కు చెందిన  వ్యక్తి దహన సంస్కారాలు నిర్వహించడానికి కుటుంబసభ్యులు రాకపోవడంతో  రాష్ట్ర మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ పీపీఈ కిట్ ధరించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా వైరస్ తో మరణిస్తే కుటుంబసభ్యులు ఎవరు ముందుకు రాకపోవడం హేయమైన చర్య అని అన్నారు. వైరస్ సోకిన నాటినుంచి మృతుల అంత్యక్రియల వరకు ప్రవర్తిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోందని,మానవ విలువలను మంటగలిపేలా ప్రవర్తించవద్దని అన్నారు. కరోనా వచ్చిన వాళ్ల సామాజిక బహిష్కరణల గురించి వార్తలు చదువుతుంటే బాధేస్తుందని, ఇలాంటప్పుడే మనం మానవత్వం చూపించాలని విజ్ఞప్తి చేశారు. పీపీఈ కిట్లు ధరించి మృతదేహాన్ని అంత్యక్రియల్లో పాల్గొనవచ్చని తెలిపారు. డెడ్బాడీ నుంచి వైరస్ వ్యాప్తి చాలా తక్కువని, కుటుంబసభ్యులు భయాందోళన నుంచి బయటకు రావాలన్నారు.

 

నంద్యాల సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన కల్పనా కుమారి

Tags:Minister attending Corona patient funeral

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *