సింహాచలంలో మంత్రి అవంతి

సింహాచలం    ముచ్చట్లు:
సింహాచలం వరాహలక్ష్మీ నృసింహస్వామి వారిని మంత్రి అవంతి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. అయనకు దేవస్థానం  అధికారులు స్వాగతం పలికారు. వేదపండితులు ఆశీర్వచనం అందించారు. దర్శనం అనంతరం మంత్రి మీడియాతో  మాట్లాడుతూ  స్వామివారి కృపతో కోవిడ్  సమస్య పోతుందని , పంచగ్రామాల భూసమస్య తీరిపోతుందని అవంతి శ్రీనివాసరావు చెప్పారు  సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు.       దేవస్థానం అభివృద్ధి విషయంలో ఈవో సూర్యకళ విశేషంగా కృషి చేస్తున్నారని మంత్రి ప్రశంసించారు . ఆమెకు అందరు సహకరించాలన్నారు. భక్తులకు మరిన్ని కాటేజీలు అందుబాటులోకి తేవాలని దేవస్థానం ఈవో కు అయన  చెప్పారు.      కాంపౌండ్ వాల్ నిర్మాణం పూర్తి చేస్తామని అవంతి హామీనిచ్చారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags:Minister Avanti in Simhachalam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *