సింహాచలం లో మంత్రి అవంతి పూజలు

విశాఖపట్నం ముచ్చట్లు:
 
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు దంపతులు శనివారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు మంత్రి దంపతులకు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం కప్ప స్తంభాన్ని అవంతి శ్రీనివాసరావు దంపతులు ఆలింగనం చేసుకున్నారు. గతవారం మంత్రి అవంతి కరోనా బారిన పడ్డారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత తన ఇష్టమైన దైవం కుటుంబ సభ్యులతో సింహాద్రి అప్పన్న దర్శించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.
పుంగనూరులో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు
Tags: Minister Avanti worships in Simhachalam