Natyam ad

పదవ తరగతి సప్లిమెంటరీ ఫలితాల విడుదల

-మంత్రి బొత్స సత్యనారాయణ

విజయవాడ ముచ్చట్లు:


గత రెండేళ్లలో   కోవిడ్ కారణంగా   తరగతులు జరగకపోవడంతో  పదో  తరగతి పరీక్షల్లో   ఉత్తీర్ణత శాతం తగ్గిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బోత్స సత్యనారాయణ అన్నారు.  ఈ కారణంతో సప్లిమెంటరీ  నిర్వహించి రెగ్యులర్ గా పాస్ అయిన  విద్యార్థులతో  సమానంగా గుర్తింపు ఇస్తున్నాం. 2 లక్షలకు పైగా  విద్యార్థులు ఎస్ ఎస్ సి  సప్లిమెంటరీలో రిజిస్టర్  చేసుకున్నారు. బాలురు 109413    బాలికలు 82433 మంది సప్లిమెంటరీ  రాసారు. బాలురు 60 శాతం  పైగా పాస్ అయ్యారు.. బాలికలు..68 శాతం  పైగా పాస్ అయ్యారు. 191896 మంది పరీక్ష రాస్తే 131233 మంది   పరీక్ష  పాస్  ఆయ్యారు . ప్రకాశం జిల్లాలో  87.52  శాతం అత్యధికంగా  పాస్  అయ్యారు. పశ్చిమగోదావరి  జిల్లాలో  అత్యల్పంగా  46.66    శాతం  పాస్ అయ్యారని అన్నారు.

 

Post Midle

Tags: Minister Botsa Satyanarayana

Post Midle