శేషారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి బుగ్గన
బేతంచెర్ల ముచ్చట్లు:
బేతంచర్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ సర్కిల్లో ఏర్పాటు చేసిన బిపి శేషారెడ్డి విగ్రహాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బేతంచర్ల పెద్దాయన తనయుడు సంజీవరెడ్డి, ఎం.పీ పోచ బ్రహ్మానంద రెడ్డి సోమవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బేతంచర్ల మండలానికి ముందు చూపుతోనే విద్య వైద్యం తాగునీటి సౌకర్యాన్ని కల్పించిన ఘనత బీపీ శేషారెడ్డిదని ఆయన కొనియాడారు. మండలానికి కావలసిన అన్ని సౌకర్యాలను కల్పించి విద్యాదాతగా నిలిచారని ఆయన మా తాతగారు కావడం గర్వకారణంగా ఉందని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, వైఎస్ఆర్ సీపీ నాయకులు బాబు రెడ్డి, చంద్రారెడ్డి, దస్తగిరి, పిట్టల జాకీర్, అధికారులు పాల్గొన్నారు.
Tags: Minister Buggana unveiled the statue of Sesha Reddy

