రెవెన్యూ అధికారుల సదస్సు పాల్గోన్న మంత్రి ధర్మాన
విశాఖపట్నం ముచ్చట్లు:
రెవెన్యూ వ్యవహారాలకు సంబంధించిన అంశాలపై సమగ్ర అవ గాహన కల్పించేందుకు ఉత్తరాంధ్ర రీజనల్ రెవెన్యూ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. విశాఖలో ఉత్తరాంధ్ర రీజనల్ రెవెన్యూ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ను మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు.ఈ సద స్సుకు ఉత్తరాంధ్ర పరిధిలోని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా రెవెన్యూ అధికారులు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, సీసీఎల్ఏ, రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి, సర్వే అండ్ సెటిల్మెంట్ డైరెక్టర్లు సైతం ఈ సద స్సుకు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడు తూ.. రెవెన్యూ శాఖలో సంస్కరణ అమలుపై సదస్సు నిర్వహించామని చెప్పారు. వందేళ్ల తర్వాత రాష్ట్రంలో ఆధునిక సాంకేతికతతో సర్వే చేస్తున్నా మని వివరించారు.అసైన్డ్ భూములు వ్యవసాయేతర పనులకు వినియోగం పై కమిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. భూములను వినియోగం లోకి తేవడం ద్వారా జీడీపీ పెరుగు తుందని మంత్రి ధర్మాన వివరించారు.
Tags: Minister Dharmana who participated in the conference of revenue officers

