వి.కోట లో అమ్మా యాక్స్ సంస్థ 25వ వార్షికోత్సవoలో మంత్రి డా.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 

వి.కోట ముచ్చట్లు:

రాష్ట్ర అటవీ, పర్యావరణం, సైన్స్ & టెక్నాలజీ, ఎలక్ట్రిసిటీ, భూగర్భ గనుల శాఖా మంత్రి   డా.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  నేడు వి.కోట పట్టణం జి.ఎం.ఆర్ కళ్యాణమండపం నందు నిర్వహించిన అమ్మా యాక్స్ సంస్థ 25వ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.మంత్రి తో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లా జడ్పిచైర్మన్ జి.శ్రీనివాసులు(వాసు) , పలమనేరు ఎమ్మెల్యే ఎన్. వెంకటేగౌడా , చిత్తూరు ఎంపి రెడ్డప్ప , ఎమ్మెల్సీ భరత్  హాజరై కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.అందులో భాగంగా 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను గోల్డ్ మెడల్స్ తో సత్కరించి, నగదు బహుమతి అందచేశారు.అనంతరం జి.ఎన్.రెడ్డి గారి జీవిత చరిత్ర పుస్తకాలను ఆవిష్కరించారు.సంస్థలోని సభ్యులకు అందవలసిన డివిడెంట్ చెక్కును ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో వి.కోట ఎంపిపి యువరాజ్ , సర్పంచ్ లక్ష్మమ్మ , రోడ్స్ కార్పొరేషన్ డైరెక్టర్ బాలగురునాథ్ , పి.ఎన్.నాగరాజ్ , జడ్పి ప్రత్యేక ఆహ్వానిథులు గౌస్ , వైస్ ఎంపిపి తమిమ్ , లక్ష్మణ్ రెడ్డి , బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి , సంస్థ సీఈవో దశరథరెడ్డి , పలు మండలాల జడ్పిటిసిలు, ఎంపిపి లు, వైస్ ఎంపిపిలు, సర్పంచులు, ఉపసర్పంచులు, ఎంపిటిసిలు, వార్డ్ సభ్యులు, ఇతర ముఖ్య నాయకులు, నామినేటెడ్ చైర్మన్లు & వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు, కార్యకర్తలు, అమ్మా యాక్స్ సంస్థ పొదుపు సంగం మహిళలు పాల్గొన్నారు.

Tags: Minister Dr. Peddireddy Ramachandrareddy at the 25th Anniversary of Amma Ax in V.Kota

Leave A Reply

Your email address will not be published.