పుంగనూరులో గ్రామీణ ప్రజలను కలుసుకునేందుకే గడప గడపకు- మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల కష్టసుఖాలను నేరుగా తెలుసుకునేందుకే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టారని రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని సుగాలిమిట్ట, చిన్నతాండాలలో గడప గడపకు కార్యక్రమాన్ని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి నిర్వహించారు. మంత్రి అతిధిగా హాజరుకావడంతో మహిళలు నీరాజనాలు పలికారు. గుమ్మడికాయలతో దిష్టితీసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రి లబ్ధిదారులకు జగనన్న సంక్షేమ బావుట పుస్తకాలను, ఓటిఎస్‌ పుస్తకాలను ప్రజలకు అందజేశారు. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ సచివాలయాల ద్వారా ప్రజలకు అన్నిరకాల సేవలు ఇండ్ల వద్దనే అందిస్తున్నట్లు తెలిపారు. పేద ప్రజలను గుర్తించి, సంక్షేమ పథకాలను పార్టీలకతీతంగా అందించిన ఘనత వైఎస్సార్‌సీపీదేనని కొనియాడారు. ప్రజలకు అవసరమైన అన్ని రకాల సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించేందుకే గడప గడపకు కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, కాలువలు పూర్తి చేయడం జరిగిందన్నారు. జగనన్న కాలనీలలో మౌళిక వసతులు ఏర్పాటు చేసి , త్వరలోనే గృహప్రవేశాలు జరిగేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఏ సమస్య వచ్చినా ప్రజలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, జెడ్పిటిసి జ్ఞానప్రసన్న , మంత్రి పీఏ చంద్రహస్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags: Minister Dr. Peddireddy should not waste time to meet the rural people in Punganur

Leave A Reply

Your email address will not be published.