వరంగల్ జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్ను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి.

వరంగల్ ముచ్చట్లు:

 

నూతనంగా నిర్మిస్తున్న వరంగల్ అర్భన్ జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్ పనులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బుధవారం పరిశీలించారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ఈనెల 21న జిల్లాకు సియం కేసిఆర్ వస్తున్నారు. * 24 అంతస్థుల మల్టీ సూపర స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన, నూతనంగా నిర్మించిన జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభోత్సవం చేస్తారు.  ప్రతి జిల్లాకు 57 కోట్ల వ్యయంతో అన్ని హంగులతో నూతన కలెక్టరేట్ల సముదాయాల నిర్మాణం చేస్తున్నాం.  ప్రజా సమస్యల సత్వర పరిష్కారం, అభివృద్ది కోసమే చిన్న జిల్లాల ఏర్పాటు. అన్ని కార్యాలయాలు ఒకే దగ్గర ఉండేందుకు సమీకృత కార్యాలయాల సముదాయాలు వుంటాయి. సమైఖ్య రాష్ట్రంలో అభివృద్దిలో వెనుకబడిన తెలంగాణ రాష్ట్రం.  పోరాడి సాధించుకున్న తెలంగాణను.. బంగారు తెలంగాణ రాష్ట్రంగా తీర్చేందుకు సియం కేసిఆర్ కృషి చేసారు.

 

 

 

తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం చిన్నచూపు చూసింది. నిధులు, హక్కుల కోసం నాడు సమైఖ్య పాలకులపై పోరాటం.. నేడు కేంద్ర పాలకులపై పోరాటం. అన్ని అడ్డంకులను అధిగమించి, నేడు దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం.  ముఖ్యమంత్రి కేసిఆర్  ముందుచూపుతోనే తెలంగాణకు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం అయింది. ప్రాజెక్టుల నిర్మాణంతో గణనీయంగా పెరిగిన ధాన్యం ఉత్పత్తి, ధాన్యం ఉత్పత్తితో దేశానికే అన్నపూర్ణగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం.  కేసిఆర్  పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు.  అందరి అభిప్రాయం మేరకే వరంగల్, హన్మకొండ జిల్లాల ఏర్పాటు చేసాం.  సియం కేసీఆర్ చరిత్రలో నిలిచే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  సియం వరంగల్ పర్యటన సంధర్భంగా ప్రజలంతా చప్పట్లతో అభినందించాలని మంత్రి  పిలుపునిచ్చారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags: Minister Errabelli inspecting the Warangal District Collectorate Complex.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *