ఆర్టీసీ సమ్మెపై మంత్రి ఎర్రబెల్లి కీలక వ్యాఖ్యలు

Date:09/10/2019

హైదరాబాద్ ముచ్చట్లు:

తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మెపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికులు తప్పు తెలుసుకుని ప్రభుత్వానికి సరెండర్ కావాలని ఆయనసూచించారు. కార్మికులు యూనియన్ నేతల మాట నమ్మొద్దని ఆయన కోరారు. పండుగ వేళ ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్,బీజేపీ వైఖరిపై కూడా ఎర్రబెల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మెకు మద్దతివ్వడానికి కాంగ్రెస్, బీజేపీకి సిగ్గుండాలని విమర్శించారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఆర్టీసీ కార్మికులకుచెల్లించని స్థాయిలో తెలంగాణ సర్కారు జీతాలు ఇస్తోందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారా ? అని ఆయన ప్రశ్నించారు.కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రాలు తమ స్వార్థం కోసం ఆర్టీసీ సమ్మెను ఉపయోగించుకుంటున్నాయని మండిపడ్డారు. ఈ విషయాన్ని కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు.

 

షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం

Tags: Minister Errabelli’s key comments on the RTC strike

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *