రామవరంలో మంత్రి ఎర్రబెల్లి పర్యటన

జనగామ ముచ్చట్లు:


5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం రామవరం గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గోన్నారు. అక్కడ గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. మొక్కలు నాటారు. గ్రామంలో వాడవాడలా పర్యటించి పారిశుద్ధ్యం, వీధి దీపాలు, పరిసరాల పరిశుభ్రత ను పరిశీలించారు.
పరిచయం ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళను బయటకు పిలిచి పలకరించారు. గ్రామంలో పారిశుద్ధ్యం నిర్వహణ పై గ్రామ సర్పంచ్, కార్యదర్శి, సిబ్బంది ని అభినందించారు. అనంతరం జరిగిన గ్రామ సభలో అంశాల వారీగా గ్రామ పరిస్థితులను సమీక్షించారు.
గ్రామంలో ట్రాక్టర్ ఎన్ని గంటలకు వస్తున్నది? సమయానికి చెత్త సేకరణ సక్రమంగా జరుగుతున్నదా? డంపింగ్ యార్డు వినియోగిస్తున్నారా? చెత్త ను ఎరువుగా తయారు చేస్తున్నారా? ట్రాక్టర్, చెత్త ద్వారా ఎంత ఆదాయం వస్తున్నది? వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర రెడ్డి, జిల్లా కలెక్టర్ శివ లింగయ్య, అడిషనల్ కలెక్టర్లు హమీద్, భాస్కర్ రావు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, అధికారులు, సర్పంచ్ మందుల శిరీష, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, పెద్ద ఎత్తున మహిళలు రామవరం గ్రామ పల్లె ప్రగతి లో పాల్గొన్నారు.

 

Tags: Minister Errabelli’s visit to Ramavaram

Post Midle
Post Midle
Natyam ad