బొమ్మకల్ నుంచి ప్రచారం ప్రారంభించిన మంత్రి గంగుల
కరీంనగర్ ముచ్చట్లు:
కరీంనగర్ మండలం బొమ్మకల్ నుండి మంత్రి గంగుల కమలాకర్ ప్రచార శంఖాన్ని పూరించారు. తొలుత యజ్ఞ వరహస్వామి ఆలయంలో… కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సెంటిమెంట్ గా వస్తున్న బొమ్మకల్ శ్రీ సీతారామ చంద్రాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అయన ప్రచారాన్ని ప్రారంభించారు. మంత్రి ప్రచారానికి అభిమానులు తెరాస శ్రేణులు వేలాదిగా తరలివచ్చారు. మహిళల మంగళహారతులు కోలాటాలు డప్పు చప్పుల మధ్య కార్యక్రమం ముందుకు సాగింది. మా మద్దతు మీకేం అంటూ మంత్రి గంగుల కు బొమ్మకల్ ప్రజలు హమీనిచ్చారు. టపాసులు కాల్చి… పూలవర్షం కురిపించారు.
Tags; Minister Gangula started his campaign from Bommakal

