Natyam ad

మిట్టపల్లి క్లస్టర్ రైతు వేదికలో మంత్రి హరీష్ రావు

సిద్దిపేట ముచ్చట్లు:


సిద్దిపేట అర్బన్ మండలంలోని మిట్టపల్లి క్లస్టర్ రైతు వేదికలో దక్కని జాతి గొర్రెల అభివృద్ధి పథకం లబ్ధిదారులు, క్షేత్ర సహాయకుల శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర ఆర్థిక మరియు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు శుక్రవారం ప్రారంభించారు. తరువాత అయన గొర్రెలకు నట్టల నివారణ మాత్రలను వేసారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ  ఎక్కువ రోగనిరోధక శక్తి కలిగి ఉండి, అధిక రుచికరమైన, అత్యధిక న్యూట్రిషన్ కలిగి ఉన్న  దక్కని గొర్రెలను  అత్యధిక సంఖ్యలో పెంచి భవిష్యత్ తరాలకు అందించాలి.  జిల్లా ప్రజలకు నాణ్యమైన రుచికరమైన దక్కని గొర్రెల మాంసాన్ని అందించేందుకు సిద్దిపేట పట్టణంలోని నాన్వెజ్ మార్కెట్లో రెండు స్టాళ్లను ఏర్పాటు చేస్తామని మిట్టపల్లి గ్రామానికి చెందిన గొల్ల కురుమలు దక్కని గొర్రెల మాంసాన్ని విక్రయించాలి.  గొర్రెలు ఆరోగ్యంగా పెరిగేందుకు నట్టల నివారణ మందులను పంపిణీ చేస్తున్నామని అన్నారు.

 

 

సంవత్సరానికి మూడు పర్యాయాలు పంపిణీ చేస్తున్నాం.  జిల్లాలో 51 బృందాల ద్వారా జిల్లాలోని  8 లక్షల 94 వేల గొర్రెలకు నట్టల నివారణ మందులను పంపిణీ చేస్తాము.  ఎకరానికి లక్షన్నర నుండి రెండు లక్షల రూపాయల ఆదాయం ఆర్జించే పామాయిల్ సాగును రైతులు చేపట్టాలి.  మిట్టపల్లి గ్రామానికి 10 కిలోమీటర్ల దూరం లోనే  నర్మెట లో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణంలో వుందని అన్నారు.  90 శాతం సబ్సిడీతో డ్రిప్స్ ను అందజేస్తాము, ఉచితంగా పామాయిల్ మొక్కలను అందిస్తాము, ఉపాధి హామీ పనులను కల్పిస్తాము.   రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి అధిక దిగుబడి పొందేందుకు రైతులు  ముందుగా పచ్చిరొట్టను పండించాలి.  పంట మార్పిడి చేయాలి. పత్తి పండించాలి పట్టు పురుగుల పెంపకం చేపట్టాలి.  ఈ కార్యక్రమంలో గొర్రెలు మరియు మేకల ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ బాలరాజు, జిల్లా అదనపు కలెక్టర్ ముజామిల్ ఖాన్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు నాగిరెడ్డి, స్థానిక సర్పంచ్ లక్ష్మి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Minister Harish Rao at the Mittapalli Cluster Farmers Forum

Post Midle