ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

నిజామాబాద్ ముచ్చట్లు:


1.30 కోట్ల వ్యయంతో నిర్మించిన మోతె ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రులు హరీష్ రావు,వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీలు  వి.జి గౌడ్,రాజేశ్వర్,జెడ్పీ చైర్మన్ విఠల్ రావు, మార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తదితరులు హజరయ్యారు.
ఈ సంధర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కేసిఆర్  2001 లో ఉద్యమం మొదలు పెట్టినప్పుడు మేము మీ వెంట ఉంటామని ఏకగ్రీవ చేసి తీర్మానం ఇచ్చిన గ్రామం మోతె. ఇక్కడి ప్రజలు ఇచ్చిన స్ఫూర్తితో మట్టిని ముడుపు కట్టి తీసుకెళ్లారు. మా తండ్రి  వేముల సురేందర్ రెడ్డి  ఆయన వెంట ఉన్నారు. రామునికి హనుమంతుడు యెట్లనో… 20 ఏళ్ల క్రితం కేసిఆర్ కు హనుమంతుని లా హరీష్ రావు ఇక్కడికి వచ్చాడు. అప్పుడు ఎవ్వరు అనుకోలేదు తెలంగాణ వస్తుంది.కేసిఆర్ ముఖ్యమంత్రి ఐతాడు అని. అయినా మోతె గ్రామం స్ఫూర్తి ఆదర్శం. నాడు ఉద్యమానికి అండగా నిలిచిన మోతె గ్రామానికి ముఖ్యమంత్రి కేసిఆర్ ఏది అడిగినా కాదనరు. 70 కోట్లతో అన్ని విధాల మోతె గ్రామాన్ని అభివృద్ది చేసుకున్నామనిఅన్నారు.

 

Tags: Minister Harish Rao inaugurated the Primary Health Center

Post Midle
Post Midle
Natyam ad