Minister Harish Rao's Birthday Celebrations

తుర్కపల్లి లో ఘనంగా మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు

Date:03/06/2020

తుర్కపల్లి ముచ్చట్లు:

తుర్కపల్లి మండల కేంద్రంలోబుధవారం ఆర్థిక మంత్రి వర్యులు  తన్నీరు హరీష్ రావు  జన్మదిన వేడుకల ను  ఆలేరు మార్కెట్  కమిటీ చైర్మన్ పడాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కేక్ కట్ మిఠాయిలు పంపిణీ చేసారు.  ఈ సందర్భంగా అయన  మాట్లాడుతూ  నిరంతరం ప్రజల బాగుకోసం అహర్నిశలు తపించే  హరిషన్న నిండు నూరేళ్లు సల్లగా ఉండాలని, ఆయన సేవలు తెలంగాణ ప్రజలకు అందివ్వాలని అన్నారు, కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి  తెలంగాణ రైతుల్లో ఆనందాన్ని నింపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి, మరియు హరీశ్ రావు కృషికి నిర్వచనము అన్నారు.,ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ చైర్మన్ బీకు నాయక్, ఎంపీపీ  సుశీలరవిందర్, ఎంపీటీసీ ల ఫోరం మండల అద్యక్షులు పల్గుల నవీన్, గిద్దె కరుణాకర్, సర్పంచ్ ల ఫోరం మండల అద్యక్షులు, ఆంజనేయులు,కో-ఆప్షన్, రామ్, సోషల్ మీడియా కన్వీనర్ నల్ల శ్రీకాంత్, మండల నాయకులు బాస్కర్ నాయక్, యాకుబ్‌, శ్రీశైలం, శత్రునాయక్,సక్రు‌ నాయక్, లచ్ఛిరామ్ నాయక్ ,బాల్ రాజు‌, అనిల్ , బాబు ,అశ్పక్ , నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులను పరిక్షలకు మానసికంగా సిద్దం చెయ్యండి.

Tags: Minister Harish Rao’s Birthday Celebrations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *