Natyam ad

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయకు మంత్రి హరీశ్ రావు లేఖ

హైదరాబాద్ ముచ్చట్లు:


కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయకు మంత్రి హరీశ్ రావు లేఖ రాసారు.  వాక్సినేషన్ విషయంలో తెలంగాణ  దేశంలోనే ముందజలో ఉంది. ఫస్ట్ డోస్  వాక్సినేషన్ విషయంలో తెలంగాణ 106 శాతం  సాధించింది. రెండో డోస్ వాక్సినేష్ లో 104 శాతం సాధించాం. ఇక 18 ఏండ్ల వయసు పైబడిన వారికి వాక్సినేషన్ లో దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో నిలిచింది. ఇప్పుడు ప్రికాషనరీ డోస్ విషయంలోతెలంగాణ  వైద్యఆరోగ్య శాఖ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రం లో డిమాండ్ మేరకు ప్రతీ రోజు 3 లక్షల డోస్ లు ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ వాక్సిన్ కొరత వల్ల రోజుకు కేవలం 1.5 లక్షల డోస్ లు మాత్రమే ఇవ్వగలుగుతున్నాం. ప్రస్తుత డిమాండ్ మేరకు మాకు వాక్సిన్ సరఫరా కావడం లేదు. రాష్ట్రంలోని డిమాండ్ మేరకు కేంద్ర ప్రభుత్వం వాక్సిన్ సరఫరా ఎప్పటికప్పుడు  పెంచాలని కోరుతున్నాం. కోవిషీల్డ్ డోస్ లు కేవలం 2.7 లక్షలు మాత్రమే ఉన్నాయి. ఇవి రెండు  రోజులకు కూడా సరిపోని పరిస్థితి నెలకొెంది. కాబట్టి వెంటనే 50 లక్షల కోవిషీల్డ్ డోస్ వాక్సిన్ రాష్ట్రానికి పంపాలని కోరుతున్నామని లేఖలో పేర్కోన్నారు.

 

Tags: Minister Harish Rao’s letter to Union Health Minister Dr. Mansukh Mandaviya

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.