Natyam ad

తూప్రాన్ లో మంత్రి హరీష్ రావు పర్యటన

తూప్రాన్ ముచ్చట్లు:


మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో 5 కోట్ల తో నిర్మించిన వ్యవసాయ గ్రీన్ మార్కెట్ యార్డ్  ను ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సోమవారం ప్రారంభించారు. ముప్పిరెడ్డి పల్లి కి చెందిన 379 మంది భూ నిర్వాసితులకు ఇళ్ల పట్టాలు, కళ్యాణ లక్ష్మీ షాధిముబారక్ చెక్కులు పంపిణీ చేసారు. తూప్రాన్ పట్టణంలో 22 కోట్ల తో పలు అభివృద్ధి పనుల కు శంకుస్థాపన చేసారు.  మంత్రి మాట్లాడుతూ రైతులకు రాష్ట్రంలో  ఉచిత కరెంటు ఇస్తున్నాం. రైతులకు పెట్టుబడి సాయంగా రైతుబంధు అందిస్తున్నాం. రైతు బంధు ద్వారా 65 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసిన రైతు బాంధవుడు సీఎం కేసీఆర్. రైతు చనిపోతే రైతు బీమా ద్వారా ఐదు లక్షల రూపాయలు ఇచ్చి రైతు కుటుంబాన్ని  ఆదుకుంటున్నామని అన్నారు.
98 వేల మంది రైతుల కుటుంబాలకు రైతు భీమా ద్వారా ఐదు లక్షలు ఇచ్చాం. ఎండాకాలంలో కూడా హల్దీ వాగు చెక్ డ్యామ్ ల పై నుండి మత్తడి దూకుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో తూప్రాన్ లో మూడు మార్కెట్లు వచ్చాయి. గతంలో ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్న వారు ఒక్క మార్కెట్ కూడా ఇవ్వలేదు. కరోనా కష్టకాలంలో కూడా ఉద్యోగుల, ఎమ్మెల్యేల, జీతాలు ఆపి రైతులకు రైతుబంధు వేశామని అన్నారు.

 

Tags: Minister Harish Rao’s visit to Tupran

Post Midle
Post Midle