ఇండియా ఛీర్స్ లో మంత్రి

హైదరాబాద్    ముచ్చట్లు:

 

బ్యాడ్మింటన్, షూటింగ్‌ క్రీడలకు తెలంగాణ పుట్టినిల్లు అని రాష్ట్ర క్రీడలశాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. బుధవారం హైదరాబాద్ సెంట్రల్‌ యూనివర్సిటీలోని గన్‌ ఫర్‌ గ్లోరీ షూటింగ్‌ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన చీర్‌ ఫర్‌ ఇండియా కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌, గగన్‌ నారంగ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గన్‌ ఫర్‌ గ్లోరీ షూటింగ్‌ అకాడమీ నుంచి ఐదుగురు ఒలిపింక్స్‌కు వెళ్లడం గొప్ప విషయం అన్నారు. గగన్‌ నారంగ్‌కు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు.రాష్ట్రంలో క్రీడాకారులకే కాదు.. కోచ్‌లకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌ను ఆధునికీకరిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ సందర్భంగా టోక్యో-2020 ఒలింపిక్స్‌ భారత బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గగన్‌ నారంగ్‌ మాట్లాడుతూ తెలంగాణలో షూటింగ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి.. వచ్చే ఒలిపింక్స్‌కు వెళ్లేలా కృషి చేస్తానని చెప్పారు.

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

 

Tgas:Minister in India Cheers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *