జ్ఞాన సరస్వతి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్
నిర్మల్ ముచ్చట్లు:
సకల జ్ఞానాలకు ఆదిదైవమైన సరస్వతీ దేవి అవతరించిన వసంత పంచమి సందర్భంగా దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు బాసర జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద పండితులు పూర్ణకుంభంతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం తర్వాత తీర్థ ప్రసాదాలు అందించి, ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వసంత పంచమి శుభాకాంక్షలు తెలిపారు. శర వేగంగా బాసర దేవాలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఆలయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Tags: Minister Indira Karan presented silk garments to Jnana Saraswati Amma