యదాద్రిలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
యాదాద్రి ముచ్చట్లు:
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.అంతకుముందు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేద ఆశీర్వచనం చేసి లడ్డు ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు.దర్శననంతరం ప్రధానాలయం అభివృద్ధి పనులను, ప్రసాద తయారీ,విక్రయ కేంద్రాలను మంత్రి పరిశీలించారు.ప్రధానాలయం అభివృద్ధి పనులు పరిశీలించి కొండక్రింద పనులు పరిశీలనకు వెళ్తున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కొండపైన వర్తక వ్యాపారులు అడ్డుకున్నారు అభివృద్ధి పనుల్లో భాగంగా కొండపైన దుకాణాలు కోల్పోయిన దుకాణదారులు దుకాణాలు కొండపైన కేటాయించాలని కోరుతూ ధర్నా చేస్తూ మంత్రి ఇంద్రకరణ్ కాన్వాయ్ అపి నిరసన తెలిపారు..దీంతో మంత్రి దుకాణదారుల వినతిపత్రం స్వీకరించి సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు దుకాణదారులు.అభివృద్ధి పనుల పరిశీలన అనంతరం కొండపైన హరిత కాటేజీ లో అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.
పుంగనూరులో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు
Tags: Minister Indira Reddy in Yadadri