జయశంకర్ సార్‌కు నివాళుర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

 

నిర్మల్ ముచ్చట్లు:
తెలంగాణ సాధించుకోవడంతో పాటు దివంగత ప్రొఫెసర్ జయశంకర్ కోరుకున్నట్టే రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా నిర్మల్ పట్టణంలోని ఆయన విగ్రహానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం ఉద్యమ సమయంలో జరిగిన పరిణామాలను, ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ తో కలిసి పని చేసిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి తన జీవితాంతం కృషి చేసిన వ్యక్తిగా జయశంకర్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతారన్నారు. తెలంగాణ స‌మాజం జ‌య‌శంక‌ర్ సార్ ను ఎన్న‌టికి మ‌రువ‌బోదు అని తెలిపారుత్వరలోనే నిర్మల్ లో దివంగత మాజీ ప్రధాని పీవీ విగ్రహ ప్రతిష్టనిర్మల్ పట్టణంలో త్వరలోనే దివంగత మాజీ ప్రధాని, తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags:Minister Indira Reddy paid tributes to Jayashankar Sar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *