పైలాటివ్ కేర్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి ఈటల

Date:16/11/2020

రంగారెడ్డి ముచ్చట్లు:

రంగారెడ్డి జిల్లా   చేవెళ్ల మండల కేంద్రంలో పైలాటివ్ కెర్ సెంటర్ ను తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సోమవారం ప్రారంభించారు. తరువాత  అనంతరం చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి సొంత నిధులతో ఏర్పాటు చేసిన అంబులెన్స్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి , రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్ అనితా రెడ్డి ఎమ్మెల్యే కాలేయాదయ్య ,  ఎంపీపీ విజయలక్ష్మి ,జడ్పీటీసీ మర్పల్లి మాలతి సర్పంచ్ శైలజా ఆగిరెడ్డి, వైద్య అధికారులు..టీఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.మంత్రి మాట్లాడుతూ చేవెళ్ళ లో పైలాటివ్ కేర్ సెంటర్ ను ప్రారంభించడం ఆనందంగా అన్నారు. గిఫ్ట్ ఏ స్మైల్ పథకం కింద చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి సొంత నిధులతో అంబులెన్స్ ను ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య ఆరోగ్య శాఖ పై ప్రత్యేక దృష్టి పెట్టారని ప్రైవేట్ హాస్పిటల్ లు వైద్యం పేరిట లక్షలు వ్యక్తం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.. ప్రైవేట్ హాస్పిటల్ పై ప్రత్యేక దృష్టి పెట్టామని డబ్బులు ఎక్కువ వసూలు చేసే హాస్పిటల్ లపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. చేవెళ్ళ ఎమ్మెల్యే యాదయ్య  మాట్లాడుతూ చేవెళ్ళ లో డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని కోరారని అన్నారు. సీఎం కేసీఆర్ సారధ్యంలో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధిలో దుసుకుపోతుందని అన్నారు.

క‌పిల‌తీర్థం, ధ్యానారామంలో కార్తీక మాస పూజ‌లు ప్రారంభం

Tags: Minister Itala inaugurates the Palliative Care Center

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *