Natyam ad

ఎంపి ఉత్తమ్ కు కౌంటరిచ్చిన మంత్రి జగదీష్ రెడ్డి

నల్గోండ ముచ్చట్లు:
ముందస్తు ఎన్నికలంటూ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి  చేసిన వ్యాఖ్యలకు మంత్రి జగదీష్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  నిన్న రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలొస్తాయని జోస్యం చెప్పిన ఎంపీ ఉత్తమ్, ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లోని అన్ని స్థానాలను భారీ మెజారిటీ తో గెలుస్తామని అన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి స్పందిస్తూ ముందస్తు ఎన్నికలపై ఉత్తమ్  పగటి కలలు కంటున్నాడు. ముందస్తు లేదు వెనకస్తూ లేదు సమయం ప్రకారమే రాష్ట్రంలో ఎన్నికలు  జరుగుతాయి. ఎప్పుడు ఎన్నికలొచ్చినా తెరాస  పూర్తి మెజారిటీ సాధిస్తుంది. ప్రజలు ఊహించని సంక్షేమం అందిస్తున్న కేసీఆర్ పాలన ఇంకా పది కాలాల పాటు రాష్ట్రంలో కొనసాగుతుంది. ప్రజాబలం కోల్పోతున్నామనే బాధతో తెరాస  పై అసంబద్ధమైన ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలని అన్నారు. తెలంగాణాలో ఉన్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవు. ప్రతిపక్షాలు విమర్శించే అవకాశం లేకుండా రాష్ట్రంలో సంక్షేమం కొనసాగుతుందని అన్నారు.
పుంగనూరులో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు
Tags: Minister Jagadish Reddy countered to MP Uttam

Leave A Reply

Your email address will not be published.