తిరుమలగిరిలో పట్టణప్రగతిని ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట  ముచ్చట్లు:
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి లో 4 వ విడత పట్టణ ప్రగతిని  మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. తుంగతుర్తి స్థానిక శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్ ఆధ్వర్యంలో మంత్రి  మొక్కలు నాటారు. మంత్రి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు  ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలి. పట్టణాలకు గొప్ప అవకాశం  ఈ పట్టణ ప్రగతి కార్యక్రమం ను  ప్రజలు అందరు కలిసి కట్టుగా  వారి వారి కాలనీలను సుందరికరణ చేసుకోవాలి.  ప్రతి పట్టణంలో గ్రామానికి తగినట్టుగా పార్క్ లు, స్మశాన వాటికలు నిర్మాణాలు చేసుకోవాలని అన్నారు. ఈ పట్టణ ప్రగతి కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, స్థానిక మున్సిపల్ చైర్మన్ రజనీ,  జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి   కౌన్సిలర్, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, టిఆర్ఎస్ వర్గ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags:Minister Jagadish Reddy initiating urban development in Thirumalagiri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *