నూతన కలెక్టరేట్ ను పరిశీలించిన మంత్రి జగదీష్ రెడ్డి

యాదాద్రి భువనగిరి ముచ్చట్లు:
 
ఫిబ్రవరి 12న నూతన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో మంత్రి జగదీష్ రెడ్డి నూతన కలెక్టరేట్ కార్యాలయం ను పరిశీలించారు. సీఎం కేసీఆర్
ప్రారంభించిన అనంతరం సీఎం పాల్గొనే సభా స్థలాన్ని మంత్రి జగదీశ్వర్ రెడ్డి తో పాటు ఎమ్మెల్యేలు ఫైళ్ల శేఖర్ రెడ్డి, సునీత మహేందర్ రెడ్డి, గాదరి కిషోర్, చిలుమర్తి లింగయ్య పరిశీలించారు.  జిల్లా
నలుమూలల నుంచి ప్రజలు పార్టీ కార్యకర్తలు సభకు రానున్న నేపథ్యంలో సభ,  పార్కింగ్ ఏర్పాటు, వివిధ మండలాల వారు ఏ మార్గం గుండా రావాలో ఎమ్మెల్యే ల తో చర్చించారు. పకడ్బందీగా సభ
ఏర్పాట్లను చేయాలని అధికారులను ఆదేశించారు.   అనంతరం నూతనంగా నిర్మించిన టిఆర్ ఎస్ పార్టీ కార్యాలయాన్ని మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు సందర్శించారు.  అదే రోజు నూతన టిఆర్ ఎస్ పార్టీ
కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
 
Tags; Minister Jagadish Reddy inspects the new Collectorate

Leave A Reply

Your email address will not be published.