కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీతో మంత్రి కేటీఆర్ భేటీ 

Minister Ketiar meeting with Union Minister Smriti Irani

Minister Ketiar meeting with Union Minister Smriti Irani

Date:17/07/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
 కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతీ ఇరానీతో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం సమావేశమయ్యారు. . ఈ సందర్భంగా రాష్ట్రంలో చేనేత సమస్యలపై కేంద్రమంత్రితో కేటీఆర్ చర్చించారు. కేంద్రమంత్రితో సమావేశం ముగిసిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.   హ్యాండ్లూన్, పవర్ లూం రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రికి  చెప్పానని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమానికి చేపడుతున్న కార్యక్రమాలు కేంద్రమంత్రికి వివరించామని తెలిపారు. చేనేత కార్మికుల సంక్షేమ కోసం రూ.1200 కోట్లతో బడ్జెట్ కేటాయించామని, రాష్ట్రానికి కొత్తగా 10 క్లస్టర్లు ఇవ్వాలని కోరామన్నారు. ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాలకు ఎంతో ప్రయోజనం ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో మరమగ్గాలు ఆధునికీకరణకు చర్యలు తీసుకుంటున్నామని, 50 శాతం ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు. 8 వేల మగ్గాలను ఆధునికీకరణ చేస్తున్నామని, ఇందుకు కేంద్రం నుంచి వచ్చే నిధులు ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరినట్లు తెలిపారు. దీనిపై కేంద్రమంత్రి స్మృతీఇరానీ సానుకూలంగా స్పందించారని మంత్రి అన్నారు.
కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీతో మంత్రి కేటీఆర్ భేటీhttps://www.telugumuchatlu.com/minister-ketiar-meeting-with-union-minister-smriti-irani/
Tags: Minister Ketiar meeting with Union Minister Smriti Irani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *