బోరబండ రిజర్వాయర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Date:13/04/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
నగరంలో విస్తృతంగా పర్యటించిన ఐటి,మున్సిపల్ మంత్రి కెటిఆర్ ఐదున్నర కోట్ల రూపాయలతో నిర్మించిన రిజర్వాయర్ ను ప్రారంభించేందుకు బోరబండకు వచ్చారు. బోరబండ డివిజన్ లో నగర డిప్యూటీ మేయర్ బాబా ఫసీయోద్దీన్, ఆయన అనుచరులు ఘనంగా స్వాగతం పలికారు. అల్లాపూర్,బోరబండ డివిజన్ లలో కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు స్థానికులు.
బోరబండలోని సైట్ -2లో 5.5 కోట్ల రూపాయలతో నిర్మించిన మంచినీటి రిజర్వాయర్ ను ప్రారంభోత్సవ సభలో ఆయన ప్రసంగించారు.  అల్లాపూర్ డివిజన్ గాయాత్రి నగర్ లోని చంద్రాగార్డెన్ ఫంక్షన్ హాలులో ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కెటిఆర్ ప్రసంగించారు. వేసవి వచ్చిందంటే చాలు నగర మహిళలు ఖాళీ బిందెలతో ధర్నాలు, ఆందోళనలు చేసే పరిస్థితులుండేవని, తెలంగాణా ఏర్పడిన తర్వాత ఆ సమస్య పరిష్కారమైందని అన్నారు. ప్రస్తుతం 90 శాతం మంచినీళ్లు అందించగలుగుతున్నామని, మిగిలిన పది శాతం కూడా త్వరలో అందిస్తామని చెప్పారు. తెలంగాణా ఏర్పడితే హైదరాబాద్ అల్లకల్లోలం అవుతుందని, కరెంటు ఉండదని కొంత మంది విమర్శించారని గుర్తు చేశారు. తెలంగాణా ఏర్పడిన ఆరు నెలల్లోనే విద్యుత్ సమస్యను పరిష్కరించుకోగలిగామని, కరెంటు కోతలు లేని తెలంగాణాను ఏర్పాటు చేసుకున్నాని అన్నారు. అలాగే వ్యవసాయానికి 24 గంటల నాణ్యామైన కరెంటు అందిస్తున్నాని చెప్పారు. గత నాలుగేళ్లలో తెలంగాణా అభివృద్ధి పథం వైపు దూసుకెళుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి మల్లారెడ్డి, కూకట్ పల్లి ఎంఎల్ఎ మాదవరం కృష్ణారావు, జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయోద్దీన్, స్థానిక కార్పోరేటర్ సబిహా బేగం, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags:Minister Ketiar started Borawada reservoir

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *