ఉత్తమ్ కుమార్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్ నిప్పులు

Minister Ketiar's fire on Uttam Kumar Reddy

Minister Ketiar's fire on Uttam Kumar Reddy

Date:06/10/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సెంచరీ కొట్టడం ఖాయమని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ చోటా మోటా నాయకులు.. చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెసోళ్లకు బలుపెక్కువ అని ఎద్దెవా చేశారు కేటీఆర్. తెలంగాణ భవన్‌లో జరుగుతున్న టీఆర్‌ఎస్‌వీ విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సైనికుడు అని చెప్పుకుంటాడు..
ఉద్యమ సమయంలో విద్యార్థులు వీర సైనికుల్లా పోరాటం చేస్తే.. మరి ఈ సైనికుడు ఎక్కడ ఉన్నాడు? ఉద్యమ సమయంలో ఈ ఆరేడు అడుగుల నాయకులు ఎక్కడ ఉన్నారు. నేను గట్టిగా మాట్లాడితే బచ్చా అంటారు? కాంగ్రెస్ నేతలు దద్దమ్మళ్ల ఇంట్లో ఉంటే.. ఈ బచ్చాగాళ్లే కదా తెలంగాణను తీసుకువచ్చింది. సైనికుడు కాదు.. ఉత్తమ్ కుమార్‌రెడ్డి బంట్రోత్. విద్యార్థి లోకం కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెబుతుందన్నారు.
కేటీఆర్. ప్రస్తుత రాజకీయాలపై విద్యార్థులకు ఎక్కువ అవగాహన ఉందన్నారు. కేసీఆర్‌ను ఎందుకు గెలిపించాలో అది కూడా విద్యార్థులకే ఎక్కువ అవగాహన ఉందన్నారు కేటీఆర్. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో టీఆర్‌ఎస్ భారీ మెజార్టీతో గెలిచిందన్నారు. నీళ్ల విషయంలో కోటి ఎకరాల మాగాణం కావాలనే సంకల్పంతో కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ప్రాజెక్టులను నిర్మిస్తున్నాం. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు నింపుతున్నాం. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు ఇవ్వబోతున్నాం. తెలంగాణ మంచి ఆర్థిక ప్రగతిని సాధించింది అని కేటీఆర్ స్పష్టం చేశారు.
Tags: Minister Ketiar’s fire on Uttam Kumar Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *