మంత్రి కొడాలి నానిపై పరువు నష్టం దావా వెయ్యాలి

Minister Kodali Nani should file defamation suit

Minister Kodali Nani should file defamation suit

Date:20/11/2019

తిరుమల ముచ్చట్లు:

టీటీడీకి చిత్త శుద్ధి ఉంటే తిరుమల క్షేత్రంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర మంత్రి కొడాలి నానిపై పరువు నష్టం దావా వెయ్యాలి అని టీటీడీ మాజీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం  ఉదయం నైవేద్య విరామ సమయంలో అయన స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. కోట్లాది హిందువులు మనోభావాలు దెబ్బతినేలా రాష్ట్ర మంత్రి కొడాలి నాని తిరుమల క్షేత్రం పై అనుచిత వ్యాఖ్యలు చెయ్యడం సరికాదన్నారు. టీటీడీ అధికారులకు చిత్త శుద్ధి ఉంటే  గతంలో రమణ దీక్షితులు,విజయ సాయి రెడ్డి పై పరువు నష్టం దావా వేసినట్టు కొడాలి నానిపై వెయ్యాలని డిమాండ్ చేశారు. ఒక్క మతానికి అనుకూలంగా ప్రభుత్వం పని చేయడం సరికాదన్నారు. ఆలయాలకు  ఒక్క రూపాయి ఇవ్వని ప్రభుత్వం పాస్టర్లు, జేరుసలేం యాత్రలకు దబ్బులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. హిందువుల్లో పేదవారు లేరా? వారికిని గుర్తించి కాశీ యాత్రలు,తిరుపతి ఆలయాలు సందర్శించేలా ఎందుకు చర్యలు తీసుకోలేదని డిమాండ్ చేశారు.

 

పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

 

Tags:Minister Kodali Nani should file defamation suit

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *