మూసీ నది, చెరువుల అభివృద్ది పై మంత్రి కెటిఆర్ సమీక్ష

 Minister KRR review on the development of Musi river and ponds

 Minister KRR review on the development of Musi river and ponds

Date:15/02/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
మున్సిపల్ శాఖపైన మంత్రి కెటి రామారావు బేగంపేట్ క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ నగరంలోని మూసి రివర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ కార్యక్రమాలపైన ప్రధాన చర్చ జరిగింది. మూసి అభివృద్ది కోసం ఒక  మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేయాలని అధికారులను అదేశించారు. మూసి నది అభివృద్ది, సుందరీకరణ వంటి అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని  మాస్టర్ ప్లాన్ తయారీ జరగాలన్నారు. మూసి నది మెత్తాన్ని సర్వే చేయాలన్నారు. ఇందుకోసం సూమారు 40 కీలోమీటర్లను డ్రోన్ వంటి అత్యాధునిక టెక్నాలజీలతో సర్వే చేయాలన్నారు. దీంతోపాటు గతంలో ఉన్న సాటిలైట్ మ్యాపులతో ప్రస్తుతం ఉన్న పరిస్ధితులను అధ్యయనం చేయాలన్నారు. ఇప్పటికే ప్రభుత్వం పరిశీలిస్తున్న మూసి నది వెంబడి రోడ్ల పైన మంత్రి సమీక్షించారు. ప్రస్తుతం ఉన్న పరిస్ధితులకు అనుకూలంగా నదికి ఇరువైపుల రోడ్లు, నదిపై నుంచి ఏలివేటేడ్ ఎక్స్ ప్రెస్ వే , మరియు రెంటింటి కలయిక తో కూడిన ప్రణాళికలను రూపొందించాన్నారు. వీటి కోసం అయ్యే ఖర్చు, సాద్యాసాద్యలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలన్నారు. దీంతోపాటు ప్రస్తుతం ఉన్న రోడ్లకు అనుబంధగా రూపకల్పన చేస్తున్న బ్రిడ్జిల డిజైన్లు, నిర్మాణం సైతం చారిత్రక, సంస్కృతికి అద్దంపట్టేలా ఉండాలన్నారు. నగర పరిధిలోని చెరువుల అభివృద్ది ప్రణాళికలను మంత్రి ఈ సమావేశంలో సమీక్షించారు. అవుటర్ రింగ్ రొడ్డు లోపల ఉన్న చెరువులను దీర్ఘకాలిక ప్రణాళిలను రూపొందించుకుని దశలవారీగా అభివృద్ది చేస్తామని మంత్రి తెలిపారు. ముఖ్యంగా ఈ సంవత్సరం వర్షకాలం నాటికి కనీసం 50 చెరువులను అభివృద్ది చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే 20 చెరువుల అభివృద్ది, సుందరీకరణ ప్రణాళికలు సిద్దంగా ఉన్నట్లు అధికారులు మంత్రికి తెలియజేశారు. వీటితోపాటు దుర్గం చెరువు సుందరీకరణ వేగంగా నడుస్తుందన్నారు. వర్షంకాలం నాటికి అయా చెరువుల్లో గుర్రపు డెక్క తొలగించడంతోపాటు, బండ్ అభివృద్ది చేయడం లాంటి పనులు ప్రారంభించాలన్నారు. చెరువులను అభివృద్ది చేసేలోపల అవి కబ్జా కాకుండా ఉంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లతో మాట్లాడాలని అధికారులను అదేశించారు.
Tags: Minister KRR review on the development of Musi river and ponds

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *