Natyam ad

జన్మదిన వేడుకలకు దూరం-మంత్రి కేటీఆర్

హైదరాబాద్ ముచ్చట్లు:


రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలున్న నేపథ్యంలో తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు తెలిపారు. వర్షాల వలన, పలు జిల్లాల్లో వరదల వలన ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు తమకు తోచిన మేరకు “గిఫ్ట్ ఏ స్మైల్” కార్యక్రమం కింద ప్రజలకు సహాయం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. పార్టీ ప్రజాప్రతినిధులు,  నాయకులు జన్మదిన సంబరాలకు బదులు స్థానికంగా ఉన్న ప్రజలకు సహాయం చేయాలని కేటీఆర్  విజ్ఞప్తి చేశారు.

 

Tags: Minister KTR away from birthday celebrations

Post Midle
Post Midle