బీబీపేటలో మంత్రి కేటీఆర్ పర్యటన

కామారెడ్డి ముచ్చట్లు:

మంగళవారం నాడు మంత్రి కేటీఆర్ బీబీపేట్ మండలం కోనాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలలో పాల్గోన్నారు. తరువాత బహిరంగ సభలో మాట్లాడారు. మంత్రి మాట్లాడుతూ చొప్పదండిలో అమ్మమ్మ ఊరిలో, కోనాపూర్ నానమ్మ ఊరిలో స్వంత డబ్బులతో పాటశాల నిర్మిస్తా. వయస్సుతో సంబంధం లేకుండా మైక్ దొరికితే చాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే నాయకులను తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారు. కేసీఆర్ పుట్టిన నాడే వందల ఎకరాల్లో పుట్టాడు. రైతు కుటుంబంలో పుట్టాడు కాబట్టి రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టే రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు. 63 లక్షల రైతన్నలకు రైతు బంధు సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని అన్నారు.
నాలుగు ఏళ్ళల్లో లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి జోరు ఎండాకాలంలో సైతం మానేరు మత్తడి దూకడం నేను చూస్తానని అనుకోలేదు. ఇది కెసిఆర్ పనితనానికి నిదర్శనం. 60, 70 ఏళ్లలో చేయని పనులు 6 ఏళ్లలో చేసిన ఘనత కేసీఆర్ ది. బీబీపేట్ ను మండలం, కామారెడ్డి ని జిల్లా చేసిన ఘనత కేసీఆర్ ది కాదా. మన ఊరు మన బడి పథకం ద్వారా విద్యా యజ్ఞానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి కేసీఆర్. కామారెడ్డిలో మంత్రిగా పనిచేసిన వారు కంత్రి పనులు చేశారు తప్ప మంచి పనులు చేయలేదు. కామారెడ్డి కి మెడికల్ కాలేజీ తెచ్చిన ఘనత గంప గోవర్ధన్ ది. కోనాపూర్ గ్రామానికి కావాల్సిన నిధులన్నీ మంజూరు చేయమని ముఖ్యమంత్రి కేసీఆర్  నాకు చెప్పారని అన్నారు.

 

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోని ఏ దేశానికి వెళ్లిన తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని పది రెట్లు పెంచిన నాయకులు కెటిఆర్. గ్రామానికి మనవడు వచ్చిన వేళ గ్రామాల్లో దసరా పండగ వాతావరణం ఏర్పడింది. దేశ విదేశాలు తిరుగుతూ 17,000 పరిశ్రమలు తెచ్చి, 225 కోట్ల పెట్టుబడులు తెచ్చి, 16 లక్షల మందికి ఉపాధి కల్పించిన నాయకులు కెటిఆర్. పుట్టిన ఊరికి స్వంత డబ్బులతో పాటశాల నిర్మించే ఆణిముత్యం లాంటి నాయకుణ్ణి నేను ఇప్పటికీ చూడలేదు. కేటీఆర్   స్పూర్తితో నా స్వంత ఊరిలో ఎదైనా చేస్తా. 80 ఏళ్ల క్రితం నిజాం పాలనలో కేసీఆర్ పూర్వీకుల భూమి కోల్పోతే  2 లక్షల 50 వేలు ఇవ్వడం జరిగింది.  కేసీఆర్ పుట్టిన నాటికే 500 ఎకరాల భూస్వామి. రెండు ఎకరాల సువిశాల ఇంటిలో పుట్టిండు కేసిఆర్. మహబూబ్ నగర్ లో గోడలకు సున్నాలు వేసినోడు, కరీం నగర్ లో చందాలు వాసులు చేసినొడు కేసీఆర్ లాంటి పెద్దమనిషిని విమర్శించడాన్ని హెచ్చరిస్తున్నా. మడమ తిప్పకుండా పోరాటం చేసి చావు నోట్లో తలపెట్టి మన బ్రతుకులు పండగ చేసిన వ్యక్తి కేసీఆర్ అని అన్నారు.

 

Tags: Minister KTR’s visit to Bibipeta

Natyam ad